18-03-2025 12:43:01 AM
విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేసిన కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17(విజయక్రాంతి) : విద్యార్థులలో కంటి చూపు లోపాలను ముందుగా గుర్తించి మెరుగైన చికిత్సలు అందేలా ప్రభుత్వం ఉచితంగా ముందస్తు కంటి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం మెహిదీపట్నం లోని సఫ్దరియా బాలి కల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కె కార్యక్రమం కింద దృష్టి లోపం ఉన్న పిల్లలకు కళ్లద్దాలు పంపి ణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్, టాబ్, కంప్యూటర్, టివి వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌పై ఎక్కువ సమ యం కేటాయించడంతో విద్యార్థుల్లో కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పా రు. వాటి నివారణకు హైదరాబాద్ జిల్లాలో 695 పాఠశాలలో 71,309 విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహించగా అందులో 8, 849 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
అందులో భాగం గా జిల్లాలోని మూడు పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు అందించడం జరిగిందని తెలిపారు. దృష్టిలోపం ఉన్న పిల్లలు వారు తప్పనిసరిగా కళ్లద్దాలు వాడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డి ఎం హెచ్ వో డాక్టర్ వెంకటి, డి ఈ ఓ రోహిణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఓలు డా. సాయిబాబా, డా. మురళీధర్, డి ఐ ఓ డా. శ్రీధర్, డిఎంఓ రాములు, కార్పొరేటర్ సర్ఫరాజ్ అహ్మద్, పాఠశాల కరస్పాండెంట్ అలీ మీర్జా, హెచ్ ఎం బేబీజైనబ్ పాల్గొన్నారు.