calender_icon.png 30 October, 2024 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరపాలక సంస్థలో ముందస్తు దీపావళి వేడుకలు

30-10-2024 04:13:19 PM

జ్యోతులను వెలిగించి.. క్యాష్ కౌంటర్ లో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్

కార్యక్రమంలో పాల్గొన్న కార్పోరేటర్లు, ఉద్యోగులు

కరీంనగర్ (విజయక్రాంతి): నగరపాలక సంస్థ ఆదాయ మార్గాలు మెరుగుపడి.. మరింత ఆర్థికంగా పరిపుష్టి చెందాలని నగరపాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం రోజు ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరపాలక సంస్థ మహిళ ఉద్యోగుల ఆద్వర్యంలో జరిగిన దీపావళి వేడుకల్లో మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ అతిథులుగా పాల్గొన్నారు. పలువురు నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి దీపావళి వేడుకలు చేశారు. కార్యాలయ ఆవరణలో పూలతో అందంగా అలంకరించి.. ప్రమిదలతో ఏర్పాటు చేసిన జ్యోతులను మేయర్, కమీషనర్ వెలిగించి అనంతరం క్యాష్ కౌంటర్ లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ ఆదాయ మార్గాలు మరింత మెరుగుపడి ఆర్థికంగా పరిపుష్టి చెందాలన్నారు. నగరపాలక సంస్థకు వివిధ రూపాల్లో రావాల్సిన పన్నులు పూర్తిస్థాయిలో రావాలని కోరుకున్నారు. నగరపాలక సంస్థలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండ లక్ష్మీదేవి దీవెనలు అందివ్వాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు బుచ్చిరెడ్డి, వాల రమణ రావు, సరిల్ల ప్రసాద్, సల్ల శారద రవీందర్, గందె మాధవి మహేష్, పలువురు మహిళ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.