హుజూరాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పండుగల ద్వారా సంతోషం వెలివేరుస్తుందని, సోదర భావం పెంపొందుతుందని అన్నారు. ఏసుక్రీస్తు శాంతికి చిహ్నం, సుఖ సంతోషాలకు నిలయమని యేసు చూపిన మార్గంని ప్రతి ఒక్కరు అనుసరించాలన్నారు.
సమాజంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా విద్యార్థిని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. క్రైస్తవులు క్రమం తప్పకుండా వారు ప్రవేశపెట్టిన భక్తిశ్రద్ధలతో బోధనలు పాటించడం శుభ పరిణామం అన్నారు. క్రీస్తు జన్మించిన విధానంలో రక్ష లాంటిదని కొని ఆడారు. విద్యార్థిని విద్యార్థులు తెలిపినటువంటి ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతం, ఆలపించిన గేయాలు ఆలోచింపచేసాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత, ఉపాధ్యాయులు తోపాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.