calender_icon.png 29 March, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుగు సీఏల ముందస్తు అరెస్టు

26-03-2025 12:19:31 AM

రామాయంపేట, మార్చి 25: రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సీఏలు ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం  తెల్లవారుజాము నుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని సంఘీభావం తెలిపారు.

తెలంగాణ ప్రభు త్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామనిహెచ్చరించారు.