కామారెడ్డి (విజయక్రాంతి): వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో నిర్వహించిన ధర్నాకు వెళ్లేందుకు ప్రయత్నించిన మెప్మా ఆర్ పి లను శుక్రవారం పోలీసులు కామారెడ్డిలో అరెస్టు చేశారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్లకుండా ఆర్పీలను కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. మెప్మా ఆర్పిల సంఘం జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల కోసం వెళుతుంటే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. తాము శాంతియుతంగా తమ నిరసనను తెలిపేందుకు హైదరాబాద్ వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం తమ హక్కులను కాలరాయడమేనని ఆమె అన్నారు. తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆర్పీలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉండి సొంత పూచి కత్తుపై విడుదల చేశారు.