calender_icon.png 22 December, 2024 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగదేవపూర్ మండల వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

13-09-2024 07:05:17 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు హేయనీయం అని మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ప్రజా పాలన పేరుతో అమలు కాని హామీలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను మోసం చేసిందన్నారు. మాజీ మంత్రి  సిద్ధిపేట శాసన సభ్యులు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిలపై దౌర్జన్యం చేసి దాడులు చేయడం అక్రమ అరెస్టులు చేయడం  ప్రజలు చూస్తున్నారు అని  తప్పకుండా బుద్ధి చెప్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ మాజీ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి,ఉపేందర్ రెడ్డి, నాయకులు కావ్య దర్గయ్య, బుద్ధ నాగరాజు, కొంపెల్లి  మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.