పటాన్ చెరు (విజయక్రాంతి): బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులను వెళ్ళనీయకుండా పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు. పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో పాటు పట్టణ, మండల నాయకులను, అమీన్ పూర్, జిన్నారం మండలాల్లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం గద్దెదిగే వరకు పోరాడుతామని కార్పొరేటర్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో బీఆర్ఎస్ జిన్నారం మండల అధ్యక్షుడు రాజేష్, నల్తూరు మాజీ సర్పంచి జనార్ధన్, నాయకులు రామకృష్ణ, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ బ్రహ్మేందర్, రమేష్ తదితరులున్నారు.