calender_icon.png 1 March, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో ముందస్తు అడ్మిషన్లు చేస్తే ఆ విద్యాసంస్థలపై ప్రత్యక్ష దాడులే

01-03-2025 05:22:14 PM

శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై విచారణకు రేవంత్ రెడ్డి ఎందుకు వెనుకడుగు..?

వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలి..

రాష్ట్ర సర్కారు పెండింగ్ ఫీజులు చెల్లింపులు చెయ్యకపోతే విద్యార్ధుల చదువులు కొనసాగేదెలా..?

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి..

కరీంనగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ బకాయిలు విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న ఇంకా విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, అదేవిధంగా రాష్ట్రంలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న విద్యాసంస్థలపై ప్రత్యేక్ష దాడులు తప్పవని, అధికారుల వత్తాసు వల్లే విద్యాసంస్థలవారు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారని, శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు కరీంనగర్ నగరంలోని స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో నిర్వహించిన సమావేశంలో మణికంఠ రెడ్డి మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం  పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజురీయింబర్స్మెంట్ నిధులు రూ. 7650 వేల కోట్ల రూపాయలు విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న ఇంకా వాటిని విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు అనేక ఆర్థికపరమైన అవస్థలు ఎదుర్కొంటున్నారని, పాలకులు మారిన విద్యార్థుల జీవితాలు మారటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నాయని అలా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న విద్యాసంస్థలను ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అడ్డుకుంటుంమాని, దానిలో భాగంగా ఆయా విద్యాసంస్థలపై ప్రత్యక్ష భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు.

కొందరు అధికారులు ప్రైవేట్ కళాశాలలకు పాఠశాలలకు వత్తాసుగా ఉన్నారని, శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు అలసత్వం జరుగుతుందని వారికి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటని, ఏ సంబంధం లేకుంటే శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడి, విద్యార్థుల ఆత్మహత్యలపై, మౌలిక సౌకర్యాలపై, అనుమతులపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించాలని, అదేవిధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న విద్యాసంస్థల యాజమాన్యంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. 

వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆ విధంగా బడ్జెట్ లో విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్ పథకాల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, నగర నాయకులు సందీప్ రెడ్డి,వినయ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.