16-04-2025 12:00:00 AM
కల్వకుర్తి ఏప్రిల్ 15: నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ కల్వకుర్తి ఎంఈఓ శంకర్ కి ఫిర్యాదు చేశారు.
కల్వకుర్తి ప్రాంతంలోని బచ్ పన్, మిలీనియం, ఎస్పీఆర్ పాఠశాలలోని ఆయా బ్రాంచుల్లో అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే విద్యార్థులను వారి వారి పాఠశాలలో చేర్పించుకునేందుకు డిస్కౌంట్ పేరుతో తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే నిబంధనలకు విరుద్దంగా సుమారు 50% అడ్మిషన్లు పూర్తి చేశారని అటు ప్రైవేటు పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని వినతిలో పేర్కొన్నారు. వారి వెంట మధు, రిత్విక్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు