calender_icon.png 19 January, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కొక్కరు 16 మందిని కనొచ్చు

22-10-2024 02:40:37 AM

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

చెన్నై, అక్టోబర్ 21: దక్షిణా ది రాష్ట్రాల్లో యువత జనా భా తగ్గిపోతు న్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజల్ని ప్రోత్సహిస్తామని ఇటీవల ప్రకటించిన విష యం తెలిసిందే. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సోమవారం చెన్నైలోని హెచ్‌ఆర్‌సీఈ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వివాహాల కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్.. ప్రజలకు 16 రకాల సంపద లు ఉండాలన్న పాత తమిళ సామెతను ప్రస్తావించారు. తమిళనాడులో తగ్గుతున్న జనాభా కారణంగా పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య తగ్గే పరిస్థితి తలెత్తినపుడు పరిమితులతో ఎందుకు జీవించాలనే ప్రశ్న వస్తుంద ని స్టాలిన్ అన్నారు. మనకు కూడా 16 మంది పిల్లలు ఉండొచ్చనే ఆలోచన కూడా తనకు వచ్చిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనా భా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని యోచిస్తోన్న నేపథ్యంలో దక్షిణాదికి చెందిన ఇద్దరు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యం సంతరించుకున్నాయి.