calender_icon.png 10 March, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువజన రంగంపై చర్చించండి

10-03-2025 02:28:25 PM

ఎమ్మెల్యే కోవలక్ష్మి కలిసిన డివైఎఫ్ఐ నాయకులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్ లో యువజన రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డివైఎఫ్ఐ నాయకులు ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సోమవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో క్రీడా మైదానాలు గ్రంధాలయాలు కోచింగ్ సెంటర్లకు ప్రత్యేక నిధులు, నిరుద్యోగ భృతి, యువజన రంగానికి ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించేలా ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేను నాయకులు కోరారు. జిల్లా స్పోర్ట్స్ అధికారిని నియమించడంతోపాటు నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్ల ఏర్పాటు చేసేలా ప్రభుత్వపై ఒత్తిడి తేవాలని కోరారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో గలమెత్తి నిధులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్, గొడిసెల కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.