calender_icon.png 27 December, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్వాక్రా మహిళలకు కుచ్చుటోపీ

08-11-2024 01:03:51 AM

కామారెడ్డి, నవంబర్ 7 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని గాజుల్‌పేట్ ప్రాంతానికి చెందిన మహిళా నాయకురాలు 16 డ్వాక్రా గ్రూప్‌లకు సంబంధించిన 200 మం ది మహిళలకు కుచ్చుటోపీ పెట్టింది. మహిళల పేరుతో బ్యాంక్‌లో రుణం తీసుకున్న సదరు నాయకురాలు అనసూజరెడ్డి సగం డబ్బులు మహిళలకు ఇచ్చి, మిగితా సగం డబ్బులు సొంతానికి వాడుకున్నది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధిత మహిళలు గురువారం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మహిళా నాయకురాలిపై చర్యలు తీసుకోవాలని మెప్మా పీడీ రాజేందర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.