calender_icon.png 29 September, 2024 | 2:31 PM

ద్వాదశ రాశిఫలాలు

29-09-2024 12:28:37 AM

29-.0--9.024 నుంచి 5.10-.2024 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి :

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి శుభంగా ఉంది. మనస్సు స్థిరంగా ఉండదు. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు విం టారు. యువతీ యువకులకు ఉన్నత ఉద్యోగాలు, మంచి వివాహ సంబంధా లు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక లాభం, ప్రమోషన్లు కలుగుతాయి. స్థాన చలనాలు ఉంటాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆర్థిక విషయంలో ఇబ్బంది ఉంటుంది. బం ధుమిత్రుల వల్ల విరోధం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో ఆటంకాలు కలిగినా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరిగినా శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చికాకుగా ఉంటారు. విదేశీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. రైతులకు లాభాలు ఉండవు. -ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. -మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.- 

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా లేదు. శారీరక అనారోగ్యం కలుగుతుంది. స్థలమార్పు జరుగుతుంది. కొంత మానసిక అశాంతి తలెత్తవచ్చు. అధిక ధన వ్యయమవుతుంది. బంధుమిత్రులతో స్పర్ధలు ఏర్ప డతాయి. యువతీ యువకులకు వివా హ, ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులు చదువులలో ముం దుంటారు. వ్యాపారస్తులు, రైతులకు పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉంది. శుభ కా ర్యాలు ఫలిస్తాయి. బంధువులతో మం చిగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. యువతీ యువకులకు అనుకు న్న వారితో వివాహాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యో గస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు, రైతులకు పనులలో సామాన్య లాభం  ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మ ధ్యరకంగా ఉంది. పనులలో ఆటంకాలు ఉంటాయి. బుద్ధి స్థిరం గా ఉండదు. తీసుకొనే నిర్ణయాలలో జా గ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యో గ-, వివాహ ప్రయత్నాలు ఆలస్యం గా ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు కలుగుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అ నుకూలంగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మం చివారితో పరిచయాలు కలుగుతాయి. సహ నంతో పని చేస్తే సత్ఫలితాలు పొం దుతారు. యువతీ యువకులకు కోరుకు న్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తా యి. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు క్రయ విక్రయాలలో సామాన్య లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.

తుల

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు చేస్తారు. బంధువులతో స్పర్ధలు ఏర్పడతాయి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు వివాహ విషయంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు ప్రతికూల కాలం. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం. ధనలాభం కలుగుతుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో శ్రమానంతర ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. పనులలో సంతృప్తి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు మంచివారితో వివాహం కుదురుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో విజయం కలుగుతుంది. విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. అన్ని విషయాలలో ఆటంకాలు ఉంటాయి. మనో చాంచల్యం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రులతో జాగ్రత్త అవసరం. ధన వ్యయమవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు.

యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులకు చికాకు, అశ్రద్ధ కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగ స్తులకు పని ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.  

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. పనులను ఆలోచించి చేయాలి. శుభకార్యాలు చేస్తారు. ప్రయాణాలవల్ల ధన వ్యయమవుతుంది. బంధుమిత్రులతో భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆనుకూలిస్తాయి.

విద్యార్థులు చదువులలో స్తబ్దుగా ఉంటారు. వ్యాపా రస్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.