calender_icon.png 14 October, 2024 | 8:13 AM

ద్వాదశ రాశిఫలాలు

14-10-2024 02:19:12 AM

14-.10.-2024 నుంచి 19.-10.-2024 వరకు 

రామడుగు రంగన్న సిద్ధాంతి :

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. స్థిరాస్తులు కొనాలనే ఆలోచన కలుగుతుంది. శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. యువతీ యువకులకు మంచి సంబంధాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో ఆసక్తి చూపుతారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్త అవసరం. చేసే పనులు విజయవంతమవుతాయి. యువతీ యువకులకు పెండ్లి విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చికాకుగా ఉంటారు. నిరుత్సాహం కలుగుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలించవు. రైతులకు లాభాలు ఉండవు. -ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది.- 

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు. చేసే పనులు ఆలస్యమవుతాయి. నమ్మిన వారు మోసం చేస్తారు. మానసిక అశాంతి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. భూతగాదాలలో కొన్ని పరిష్కారమవుతాయి. బంధుమిత్రులతో స్పర్ధలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులు చదువులో ముందుంటారు. వ్యాపారస్తులు, రైతులు చేసే పనులలో జాగ్రత్త పడాలి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. ధన వ్యయం అవుతుంది. బంధు విరోధం కలుగుతుంది. స్థిరాస్తులు కొనే ప్రయత్నం చేస్తారు. దేవాలయ సందర్శనలు చేస్తారు. యువతీ యువకులకు అనుకున్న వారితో వివాహాలు జరుగుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. చేసే పనులు కొన్ని అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో జాప్యం కలుగుతుంది. -విద్యార్థులకు చదువులలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు, రైతులు సామాన్య లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. యువతీ యువకులకు మంచివారితో వివాహం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

తుల

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. శుభవార్తలు వింటారు. చేసే పనులు ఫలిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శుభవార్తలు వింటారు. ధనవ్యయం అవుతుంది. బంధుమిత్రులతో భేదం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు ప్రతికూల కాలం. మొత్తం మీద ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. ధన వ్యయం అవుతుంది. శుభవార్తలు వింటారు. చేసే పనులు కలిసి వస్తాయి. మానసిక చికాకులు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు చదువులలో ఆసక్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. ధనం లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు మంచివారితో వివాహం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ధనలాభం కలుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వాహనాలు కొంటారు. బంధువులకు విరోధం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. పెద్దల మాట వినవలసి ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం కలుగుతుంది. వేగిర పడి నిర్ణయాలు తీసుకోవద్దు. ధన వ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో ఆలస్యమవుతుంది. విద్యార్థులకు చికాకు, అశ్రద్ధ కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యమంగా ఉంది. చేసే పనులు లాభిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో భేదాలు కలుగుతాయి. అశాంతిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. శుభ కార్యాల ప్రయత్నం చేస్తారు. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో పట్టుదల అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.