calender_icon.png 26 October, 2024 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వాదశ రాశిఫలాలు

26-05-2024 01:15:19 AM

26.05.2024 నుంచి 01.06.2024 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి

మేషం:-

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ధన సంబంధ ఇబ్బందులు దూరమవుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ నిశ్చయాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటివి ఉంటాయి. వ్యాపారస్తులకు అధిక లాభాలు, అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మంచి కళాశాలలో సీటు దొరుకుతుంది. రైతులకు లాభాలు. మొత్తం మీద 70 శాతం అనుకూల, 30 శాతం ప్రతికూల ఫలాలు ఉన్నాయి. 

వృషభం: 

కొన్ని విషయాలలో అనుకూలాలు, మరికొన్ని విషయాలలో ప్రతికూలాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలు మందకొడిగా సాగవచ్చు. యువతీ యువకులు గట్టి ప్రయత్నాలు చేస్తే వివాహాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు తప్పవు. వ్యాపారస్తులుకు స్వల్ప లాభాలు ఉంటాయి. విద్యార్థులకు చదువులలో కలిసివస్తుంది. విదేశీ ప్రయాణ యత్నాలు ఫలిస్తాయి. రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి.- 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత. 

మిథునం:

గ్రహస్థితి సామాన్యంగా ఉంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులు, బంధువులతో భేదాభిప్రాయాలు రావచ్చు. యువతీ యువకులకు వివాహ విషయం ఆలస్యం అవుతుంది. విద్యార్థులకు చదువులలో అనాసక్తి ఏర్పడుతుంది. కనుక, తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. వ్యాపారస్తులు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు విపరీత ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం:

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో బాగా రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులు, రైతులకు లాభాలు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉన్నది. 

సింహం:

గ్రహస్థితి మధ్యస్థంగా ఉంది. ఆరో గ్య విషయమై జాగ్రత్త అవసరం. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. విద్యార్థులకు చదువు విషయమై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కలుగవచ్చు. ఉద్యోగస్తులకు అధిక ఒత్తిడి ఉంటుంది. భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. కనుక, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉన్నది. 

కన్య:

గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. యువ తీ యువకులకు కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు విద్యా విషయక అభివృద్ధి సూచనలు వున్నాయి. వ్యాపా రస్తులకు, రైతులకు అనుకూల లాభాలు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి 65 శాతం అనుకూలం, 35 శాతం ప్రతికూలత ఉంది. 

తుల:

గ్రహస్థితి మధ్యస్థంగా ఉంది. బంధు మిత్రులను, ఆత్మీయులను కలుస్తారు. శుభవార్తలు వింటారు. మానసిక ఒత్తిళ్లతో ఇబ్బందులు తలెత్తవచ్చు. యువతీ యువకులకు వివాహ విషయంలో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు మేలైన పరిస్థితులు వున్నాయి. ఉద్యోగస్తులకు పైవారితో స్పర్ధలు రావచ్చు, జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో అప్రమత్తత అవసరం. మొత్తం మీద ఈ రాశి వారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉన్నది. 

వృశ్చికం:

గ్రహస్థితి మధ్య రకంగా వుంది. ఆరోగ్య విషయమై చాలా శ్రద్ధ అవసరం. చేసే పనులలో కొన్ని మాత్రమే పూర్తవుతాయి. కుటుంబంలో పలు ఇబ్బందులు కలుగవచ్చు. యువతీ యువకులకు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కొంత ఊరట లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు:-

గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది. ధన రాబడి అనుకూలం. శుభవార్తలు వింటారు. శారీరక అనారోగ్యం కలుగుతుంది. యువతీ యువకులకు పెండ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఆయా పరీక్షలలో ఉన్నత ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు, రైతులకు పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉన్నది. 

మకరం:--

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. బంధు వులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో రాణిస్తారు. వ్యాపారస్తులు, రైతులు లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. చేసే పనులలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం:

గ్రహస్థితి మధ్య రకంగా ఉంది. ఆలోచించి పని చేస్తే లాభాలు కలుగుతాయి. వేగిర పడరాదు. ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరం. కొన్ని పనులు కలిసివస్తాయి. కొందరితో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ధన విషయంలో పొదుపు అవసరం. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా యోగం ఉంది. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం:

గ్రహస్థితి సామాన్యంగా ఉంది. చేసే పనులలో ప్రతికూలత ఏర్పడి ఆలస్యం కావచ్చు. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. అందరితో భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. యువతీ యువకులకు వివాహ విషయం ఆలస్యమవుతుంది. విద్యార్థులకు విద్యా విషయక స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పని ఒత్తడి పెరుగుతుంది. ఈ రాశి వారికి 25 శాతం అనుకూలత 75 శాతం ప్రతికూలత ఉన్నది.