మేషం
ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి శుభకరం గా ఉంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విలువైన వస్తువులు కొంటారు. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు మంచివారితో వివాహం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. -ఉద్యోగస్తులకు మం చి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారం చేస్తారు. లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. రైతులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 82 శాతం అనుకూలత 18 శాతం ప్రతికూలత ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉంది. బంధువులతో విరోధాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులు అధిక శ్రమతో పూర్తవుతాయి. యువతీ యువకులకు పెండ్లి విషయాలలో జాగ్ర త్త అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాలి. విదేశీయాన ప్రయ త్నాలు ఫలించవు. రైతులు జాగ్రత్తగా ఉండాలి. అందరికీ పొదుపు అవస రం. -భూసంబంధ సమస్యలతో అశాంతిగా ఉంటారు. కావలసిన వారు మోసం చేస్తా రు. మొత్తం మీద ఈ రాశివారికి 20 శా తం అనుకూలత, 80 శాతం ప్రతికూలత ఉంది.
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. ధనవ్యయమవుతుంది. బంధుమిత్రులతో మంచిగా ఉంటారు. కొత్త ఆలోచనలతో ముందు కు సాగుతారు. యువతీ యువకులకు ఉద్యోగ, వాహ ప్రయత్నాలలో జా ప్యం జరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధతో చదవాలి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్లకు లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి శుభకరంగా ఉంది. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. అనేక మంచి కార్యక్రమాలు చేస్తారు. కొత్తవారితో పరిచయా లు ఏర్పడతాయి. శుభకార్యాలవల్ల ధనవ్యయమవుతుంది. బంధువులతో ఆనం దంగా ఉంటారు. యువతీ యువకులకు అనుకున్నట్లు వివాహాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇష్టంతో చదువుతూ, ఉన్నతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు, రైతులకు శుభకర లాభాలుంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉంది. ఆత్మీయులతో ప్రేమ గా ఉంటారు. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. అపవాదులకు లోనవుతారు. ప్రయాణాలవల్ల అనారోగ్యం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తొందరగా ఫలించవు. విద్యార్థులు చదువు లలో ముందంజలో ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు అనుకున్న లాభాలు రావు. ఉద్యోగస్తులకు శ్రమ అధికం, ఫలితం స్వల్పం అవుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తా యి. భగవదారాధన, పూజలు, అన్నదానాలు చేస్తారు. సాధు సత్పురుషులను కలుస్తారు. ఉన్నతమైన వారితో స్నేహం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. యువ తీ యువకులకు ఉద్యోగ, వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు చదువు, ఉద్యోగాలలో ఉన్నతి ఉంటుం ది. వ్యాపారస్తులకు, రైతులకు అధిక లాభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ధన విషయక సమస్య లు ఏర్పడతాయి. పెట్టుబడులకు సరైన సమయం కాదు. బంధువులతో వైరుధ్యాలు కలుగుతాయి. దూర ప్రయాణా లవల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. నిం దలకు లోనవుతారు. యువతీ యువకు లకు ఉద్యోగ, వివాహ విషయాలలో అధిక ప్రయత్నం అవసరం. విద్యార్థులు పట్టుదలతో చదవాలి. ఉద్యోగస్తులకు కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారస్తుల కు, రైతులకు మంచి కాలం కాదు. మొ త్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భూసంబంధ కలహాలు ఏర్పడతాయి. కొన్ని శుభకార్యాలు చేస్తారు. ధనవ్యయమవుతుంది. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణా లతో అస్వస్థతకు గురవుతారు. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు ఉన్నత ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభనష్టాలు సమా నంగా ఉంటాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 62 శాతం అనుకూలత, 38 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచి గా ఉంది. అనుకున్న ధనం సమకూరుతుంది. బంధువులతో సంతోషం గా గడుపుతారు. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. బంగారం, వాహనాలు లాంటి ఖరీదైన వస్తువులను కొం టారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు, పండుగలు చేస్తారు. ధనవ్యయమవుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొం దుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. తలచిన పనులు పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. నూతన వాహన యోగం ఉంది. మంచివారితో పరిచయాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు, రైతులు అనుకూల లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. బంధుమిత్రులతో విరో ధాలు సంభవిస్తాయి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అశాంతిగా ఉంటుం ది. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత పురోగతి పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. చేసే పనులు ఆలస్యమవుతాయి. శుభకార్య నిమిత్తమై ఖర్చులవుతాయి. భూసంబంధ సమస్యలు ఏర్పడతాయి. దూర ప్రయా ణాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ప్రయ త్న శీలురై ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్ప లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.