8-9-2024 నుంచి 14-9-2024 వరకు
మేషం
ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి శుభంగా ఉంది. మనస్సు స్థిరంగా ఉండదు. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు ఉన్నత ఉద్యోగాలు, మంచి సంబంధాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు, ప్రమోషన్లు కలుగుతాయి. స్థాన చలనాలు ఉంటాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు. బంధుమి త్రులవల్ల విరోధం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, పెండ్లి విషయాల లో ఆటంకాలు ఎదురైనా విజయాలు సా ధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు పెరిగినా శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు జా గ్రత్తగా ఉండాలి. -మొత్తం మీద 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. స్థలమార్పు జరుగుతుంది. కొంత మానసిక అశాంతి కలుగుతుంది. బంధుమిత్రులతో స్పర్ధలు ఏర్పడతాయి. యువతీ యువకులకు వివా హ, ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. వ్యాపారస్తులు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. బంధువుల తో మంచిగా ఉంటారు. శుభ కార్యక్రమ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. యువతీ యువకులకు అనుకున్న వారితో వివాహాలు జరుగుతా యి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపార స్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటా యి. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. తీసుకొనే నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ,- వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. వ్యాపారస్తులు, రైతులకు సామా న్య లాభాలు, ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు కలుగుతాయి. మొత్తం మీద 30 శాతం అనుకూల త, 70 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మ ధ్యమంగా ఉంది. అనుకు న్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. పరిచయాలు కలుగుతాయి. యువతీ యువకు లకు కోరుకున్న వారితో వివాహ నిశ్చయా లు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వి ద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు, రైతులకు లాభాలు ఉన్నాయి. మొత్తం మీద 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆర్థిక లాభా లు కలుగుతాయి. బంధువులతో స్పర్ధలు ఏర్పడతాయి. చేసే పనులలో ఆటంకాలు కలుగుతాయి. యువతీ యువకులకు వివా హ విషయంలో పురోగతి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు ప్రతికూల కాలం. మొత్తం మీద 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. ఆరోగ్య విషయమై కొంత జాగ్రత్త అవసరం. ధన లాభం కలుగుతుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో శ్రమానంతర ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు మంచివారితో వివాహం కుదురుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో జాప్యం జరుగుతుంది. విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు, రైతులకు సామాన్యలాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. మనో చాంచ ల్యం కలుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రులతో జాగ్రత్త అవసరం. ధన వ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. యువతీ యువకులకు ఉద్యో గ వివాహ ప్రయత్నాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులకు చికాకు, అశ్రద్ధ ఏర్పడ తాయి. వ్యాపారస్తులు, రైతులకు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉం టుంది. మొత్తం మీద 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. చేసే పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రులతో భేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. యువతీ యువ కులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో స్తబ్దంగా ఉంటారు. వ్యాపారస్తులు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.