calender_icon.png 6 October, 2024 | 6:03 AM

ద్వాదశ రాశిఫలాలు

06-10-2024 12:37:00 AM

6-.10.2024 నుంచి 12-.10-.2024 వరకు 

రామడుగు రంగన్న సిద్ధాంతి :

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మంచిగా ఉంది. అనుకున్న పనులు విజయవంతమవుతాయి. ధన విషయక ఇబ్బందులు దూరమవుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ నిశ్చయాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ప్రమోషను, జీతం పెరుగుదల మొదలైనవి ఉంటాయి. వ్యాపారస్తులకు అధిక లాభాలు, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు మంచి కళాశాలలో సీటు దొరుకుతుంది. రైతులకు లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది.  

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. కొన్ని విషయాలలో అనుకూలత, మరికొన్ని విషయాలలో ప్రతికూలతలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. యువతీ యువకులు గట్టి ప్రయత్నాలు చేస్తే వివాహాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిళ్లు ఉంటాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు ఉంటాయి. విద్యార్థులకు చదువులలో కలిసివస్తుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది.

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మిత్రులు, బంధువులతో భేదాభిప్రాయాలు వస్తాయి. యువతీ యువకులకు వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది. విద్యార్థులకు చదువు విషయమై అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులు, రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు విపరీత ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి  సా మాన్యంగా ఉంది. తరచూ ప్రయాణాలు చేస్తారు. ప్రారంభించిన పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు అను కూలిస్తాయి. విద్యార్థులు చదువులలో రాణిస్తారు. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులు, రైతులకు స్వల్ప లాభాలు వస్తాయి. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. చేసే పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. ఆరోగ్యం విషయమై జాగ్రత్త అవసరం. యువతీ యువకులకు వివాహాలు ప్రయత్నం మీద జరుగుతాయి. విద్యార్థులకు చదుపు విషయమై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు ఆర్థిక విషయంగా ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధిక ఒత్తిడి ఉంటుంది. భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి చా లా అనుకూలంగా ఉంది. తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. యువతీ యు వకులకు కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు విద్యా విషయక అభివృద్ధి జరు గుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు అ నుకూల లాభాలు కలుగుతాయి. మొ త్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

తుల

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ధన వ్యయమవుతుంది. బంధుమిత్రులను, ఆత్మీయులను కలుస్తారు. శుభవార్తలు వింటారు. మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతారు. యువతీ యువకులకు వివాహ విషయంలో జాప్యం జరుగుతుంది. విద్యార్థులకు మేలు కలుగుతుంది. ఉద్యోస్తులకు పైవారితే స్పర్ధలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం. చేసే పనులు పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్ప లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కొంత ఊరట లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచిపనులు చేస్తారు. ధన విషయ రాబడి ఉంది. శుభవార్తలు వింటారు. శారీరక అనారోగ్యం కలుగుతుంది. యువతీ యువకులకు పెండ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులు, రైతులు నిలకడగా ఉంటారు. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.- విద్యార్థులు చదువులలో రాణిస్తారు. వ్యాపారస్తులు, రైతులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆలోచించి పని చేస్తే లాభాలు కలుగుతాయి. వేగిర పడరాదు. ఆరోగ్యం విషయమై శ్రద్ధ అవసరం. కొన్ని పనులు కలిసిరావచ్చు. కొందరితో మనస్పర్ధలు ఏర్పడతాయి. ధన విషయమై పొదుపు అవసరం. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యాయోగం ఉంది. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. చేసే పనులలో ప్రతికూలత ఏర్పడి ఆలస్యమవుతుంది. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. అందరితో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు వివాహ విషయంలో ఆలస్యమవుతుంది. విద్యార్థులకు విద్యా విషయక స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పని ఒత్తడి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.