అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): పోలీసులు అంకితభావంతో విధు లు నిర్వర్తించాలని అడిషనల్ డీజీపీ సంజ య్‌కుమార్ జైన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ సార్ధ పూర్ నందు గల 17వ బెటాలియన్‌లో నిర్మి ంచిన ఫ్యాబ్రికేటెడ్ బ్యారెకులను, గార్డ్‌రూమ్ ను, బెటాలియన్ వెల్ఫేర్ కాంప్లెక్స్ ఆర్చ్‌ని శు క్రవారం ఆయన ప్రారంభించారు.
నిర్మాణం లో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్స్, కమాండ్ కంట్రో ల్ భవనాలను పరిశీలించారు. అనంతరం దోభి, బార్బర్ గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీ జీపీ మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ కలిగిన సంస్థ అని తెలిపా రు. బెటాలియన్ అభివృద్ధిలో ఆఫీసర్లు, సి బ్బంది పాత్ర అభినందించదగినన్నారు.
అ నంతరం బెటాలియన్ అధికారులు, సిబ్బం దితో సమావేశమయ్యారు. ఆయన వెంట కమాండె ంట్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమాండెంట్ లు సాంబశివరావు, ఉదయభాస్కర్, రామదా సు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్ర మీల ఉన్నారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలోని పంచాయతీ రాజ్ వసతి గృహంలో అడిషన ల్ డీజీపీకి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వాగతం పలికారు.