12-04-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశరాజధాని న్యూఢిల్లీ, దాని పరిసరాల్లో శుక్రవారం దుమ్ము తుఫాన్ సంభవించింది. గురువారం కూడా ఇలాగే తుఫాన్ ప్రజలను అతలాకుతలం చేసింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆరుబయట ఎవరూ ఉండొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను సమయంలో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి.
కొన్ని గంటల్లో ఢిల్లీలో వర్షం పడే అవ కాశం ఉందని వాతావరణ శాఖ సూచిం చింది. ఈ గాలులతో విమాన సర్వీసు లకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 15 విమానాలను అధికారులు మళ్లిం చారు. తీవ్రమైన గాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. రోడ్ల మీద భారీ వృక్షాలు పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.