హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన కాకినాడ టౌన్‌లో రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
ఈ నెల 7వ తేదీన సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకునేలా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో నల్గొండ, మిర్యాల గూడలో, ఏపీలోని గుంటూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నట్లు అధికారులు వెల్లడించారు.