calender_icon.png 2 October, 2024 | 5:59 PM

నేటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

02-10-2024 12:27:37 AM

6 నుంచి జూనియర్ కాలేజీలకు..

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): విద్యార్థులకు దసరా సెలవులు వచ్చేశాయి. బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా బుధవారం నుంచి ప్రభుత్వం స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతికి ఎలాగో సెలవు ఉండటంతో బుధవారం నుంచే దసరా సెలవులు వచ్చేశాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 14వ తేదీ వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. 15న తిరిగి బడులు తెరుచుకోనున్నాయి. జూనియర్ కాలేజీలకు 6వ తేదీ నుంచి దసరా సెలవులు ఇవ్వనున్నారు.