calender_icon.png 16 October, 2024 | 7:45 PM

దసరా పండుగ రోజు ముహూర్తం!

08-10-2024 12:00:00 AM

నేచురల్ స్టార్ నాని  శ్రీకాంత్ ఓదెల అనగానే మనకు గుర్తొచ్చే చిత్రం ‘దసరా’. ఈ చిత్రం మంచి విజయం సాధించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ కాంబో మరోసారి రిపీట్ అయితే బాగుండని నాని ఫ్యాన్స్ కూడా ఆశ పడుతున్నారు. వారి ఆశలు నెరవేరబోతున్నాయని తెలుస్తోంది. ఆసక్తికరంగా వీరిద్దరి కాంబోకు కూడా ముహూర్తం దసరాయే కావడం విశేషం. శ్రీకాంత్ ఓదెల కథానాయకుల కోసం బాగా గాలించారు.

మరోవైపు నాని కూడా బలగం వేణు దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు. చివరకు శ్రీకాంత్ ఓదెల లైన్‌లోకి వచ్చారు. ఇద్దరి కాంబో ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక చిత్రీకరణకు సైతం ముహూర్తం ఖరారైనట్టుగా చెప్పుకొంటున్నారు. ఆ ముహూర్తం దసరా పండుగేనని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో వినవస్తోంది. 

త్వరలోనే నాని సహా ఇతర నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలు  ప్రకటించే అవకాశం ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి శ్రీకాంత్ చిత్రంతో తప్పక మరో హిట్ పడుతుందని అభిమానులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు.