దసరా వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్, విజయరామరావు
పెద్దపల్లి (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లాలో శనివారం దసరా పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం, పెద్దపెల్లి ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్, విజయరామారావు పాల్గొని పండుగను ప్రజలతో కలిసి జరుపుకున్నారు. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని వారు షమీ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు అమ్మవారి ఆశీర్వాదాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరారు.