బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయం వద్ద వాహన పూజ నిర్వహించి తన సతీమణి గడ్డం రమతో కలిసి జమ్మి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు చేశారు. కోదండ రామాలయం వద్ద దుర్గామాత శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం తిలక్ క్రీడా మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రామ్ లీలా కార్యక్రమoలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. అనంతరం తిలక్ క్రీడా మైదానానికి భారీగా తరలివచ్చిన అశేష ప్రజల మధ్య ఎమ్మెల్యే వినోధ్ దంపతులు దసరా ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వినోద్ బాణం ఎక్కుపెట్టి రావణ దహనం చేశారు. ఈ దృశ్యాన్ని ప్రజలంతా ఆసక్తిగా వీక్షించారు. మొత్తం మీద బెల్లంపల్లి నియోజకవర్గంలో శనివారం విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.