calender_icon.png 18 October, 2024 | 8:56 AM

దసరా బొనాంజా

18-10-2024 02:50:55 AM

రీంనగర్, అక్టోబరు 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ రీజయన్ పరిధిలోని 11 డిపోలకు దసరా వేడుకల సందర్భంగా నడిపిన బస్సులకుగాను రూ.31.50 కోట్ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 1 నుంచి 16 వరకు, అక్టోబర్ 2, 12 తేదీలకు మినహాయిస్తే మిగతా రోజుల్లో కరీంనగర్ రీజియన్‌కు ఈ ఆదాయం సమకూరింది. మొత్తం 53.32 లక్షల కిలోమీటర్ల ప్రయాణం కొనసాగగా, 31.50 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా నమోదయ్యింది. మొత్తం 61 లక్షల 11వేల 849 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఇందులో మహాలక్ష్మి కింద 42 లక్షల 34 వేల 542 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో అత్యధికంగా గోదావరిఖని డిపో పరిధిలో ఆదాయం సమకూరింది. గోదావరిఖని డిపోకు 5 కోట్ల 27 లక్షల 45 వేల రూపాయల ఆదాయం సమకూరగా, రెండవ స్థానంలో కరీంనగర్ డిపో నిలిచింది. కరీంనగర్ డిపోకు 4 కోట్ల 22 లక్షల 19వేల రూపాయల ఆదాయం సమకూరింది. తర్వాత జగిత్యాల డిపోకు 4 కోట్ల 21 లక్షల 74 వేల రూపాయల ఆదాయం సమకూరింది. కరీంనగర్ డిపోకు 3 కోట్ల 38 లక్షల 36వేల ఆదాయం సమకూరింది. 

అత్యల్పంగా సిద్ధిపేట జిల్లా..

అత్యల్పంగా సిద్ధిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ డిపోకు ఆదాయం సమకూరింది. ఈ డిపోకు కోటి 43 లక్షల 42వేల రూపాయల ఆదాయం సమకూరింది. మంథని డిపోకు కోటి 83 లక్షల 91వేల ఆదాయం సమకూరింది. హుజూరాబాద్ డిపోకు అక్యుపెన్సీ శాతం 107 శాతం లభించగా, మెట్‌పల్లికి 106 శాతం లభించింది. 99 శాతం దక్కించుకున్న డిపోల్లో సిరిసిల్ల, కోరుట్ల ఉన్నాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలో మొత్తం కరీంనగర్ జిల్లా పరిధిలో.. కరీంనగర్‌ొో1, కరీంనగర్ హుజూరాబాద్ డిపోలు ఉండగా, పెద్దపల్లి జిల్లా పరిధిలో.. గోదావరిఖని, మంథని డిపోలు, జగిత్యాల జిల్లా పరిధిలో.. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో.. సిరిసిల్ల, వేములవాడ, సిద్ధిపేట జిల్లా పరిధిలో.. హుస్నాబాద్ డిపో ఉన్నాయి.