calender_icon.png 14 March, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుశ్యర్ల సత్యనారాయణను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి

13-03-2025 12:00:00 AM

సూర్యాపేట మార్చి 12: ఆయన 72 ఏళ్ళ వయసులోనూ చురుకుగా సామాజిక అంశాలపై, పేద ప్రజల సమస్యలపై ప్రభుత్వా లు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్న దుశ్యర్ల సత్యనారాయణను నేటి యువత ఆదర్శంగా తీసుకో వాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ కమిటీ జాతీయ ఛెర్మైన్ డా.బొమ్మరబోయిన కేశవులు అన్నారు.

బుధవారం జల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దుశ్యర్ల సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా రాఘవపురం గ్రామంలోని అటవీ వనంలో ఆయ నను కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుశ్యర్ల నాయకత్వంలో నాడు సాగిన ఉద్యమంతో కరువు జిల్లా అయిన నల్గొండ జిల్లాలో కొంత మేర నేటి సమస్య తీరిందని, ఫ్లోరైడ్ ప్రభావం తగ్గిందని గుర్తుచేశారు.

తనకున్న వ్యవసాయ భూమిలో అడవిని పెంచి పర్యావరణాన్ని కాపాడుతుండటం గొప్ప విష యం అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం దష్యర్ల సత్యనారాయణ జీవితాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని, ఆయన సృష్టించిన అడవిని పాఠ్యాంశాలలో చేర్చాలని కోరారు. ఆయురారోగ్యాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవించేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు.