12-02-2025 05:47:54 PM
మాజీ మంత్రి జోగు రామన్న..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): అన్ని వర్గాల హితమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని, కుల, మతాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు పడ్డారని మాజీమంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులతో పట్టణంలోని జామా మసీదు, చామన్ వాలా బాబా దర్గా వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని పలు మసీదులు, దర్గాల అభివృద్ధి నిమిత్తం 17 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, అందులో 12 కోట్ల నిధులు విడుదల అయినట్లు తెలిపారు.
మిగిలిన నిధుల విడుదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు ఉన్నతాధికారులను సైతం కలుస్తామని పేర్కొన్నారు. జామా మసీదు అభివృద్ధి పనులు పూర్తి కావడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. మజీద్ కమిటీ సభ్యులు ఇస్రాత్ హుస్సేన్, బాబు బాయ్ సయ్యద్ ఇనాయక్ అలీ, నాయకులు సాజిదోద్దీన్, అజయ్, అష్రాఫ్ తదితరులు ఉన్నారు.