calender_icon.png 29 September, 2024 | 4:45 PM

బీఆర్‌ఎస్ హయాంలోనే హైదరాబాద్ గాలికి

26-09-2024 03:31:05 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేశారని, ఇప్పుడు తెగబడుతున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆరోపించారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడు తూ.. చిన్న వర్షం పడితేనే నగరం వణికిపోయే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.

వినేవాళ్లు అమాయకులైతే హైదరాబాద్ నగరాన్ని కనిపె ట్టింది కల్వకుంట్ల కుటుంబమేనని కేటీఆర్ చెబుతాడేమోనని ఎద్దేవాచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ట్రాఫిక్ సమస్యపై కూడా ఎప్పుడూ దృష్టి పెట్టలేద ని, చిన్న పాటి వర్షానికే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

దుర్గంచెరువు సెల్ఫీ పాయింట్ తప్ప కేటీఆర్ చేసిందేమీ లేదని, వడ్డించిన విస్తరిలా నగరాన్ని అప్పగించి పోయామనడంలో వాస్త వం లేదని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోవడానికే కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నా రని విమర్శించారు. కేటీఆర్ ఎన్ని డ్రామాలు ఆడినా నగర ప్రజలు కాం గ్రెస్‌తోనే ఉంటారని, సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన హైడ్రాతో ప్రజలు సంతో షంగా ఉన్నారని తెలిపారు.