calender_icon.png 4 October, 2024 | 11:00 AM

బంగ్లాలో దుర్గా పూజలు బంద్

04-10-2024 01:30:46 AM

భద్రత పేరుచెప్పి అనుమతి నిరాకరణ

ఢాకా, అక్టోబర్ 3: బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం పతనం తర్వాత చెలరేగిపోతున్న మెజారిటీ వర్గమైన ముస్లింలోని అతివాదులు.. మైనారిటీ హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ దుర్గాష్టమిపై కూడా కఠిన ఆంక్షలు విధించారు. ఢాకా సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహా లు నెలకొల్పి పూజలు చేసుకొనేందుకు మత ఛాందసవాదుల హెచ్చరికలతో తాత్కాలిక ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

ప్రతిసారిలాగే ఈసారి కొందరు విగ్రహాలు పెట్టి పూజలు చేయటానికి ప్రయత్నించగా వాటిని ధ్వంసం చేసినట్లు సమాచారం. కిశోర్‌గంజ్‌లోని బాత్రిస్ గోపినాథ్ జియుర్ అఖారాలో దుర్గమాత విగ్రహాన్ని మెజారిటీ వర్గం వారు గురువారం ఉదయం ధ్వంసంచేశారు. నరైల్ జిల్లాలోని మిరపర ఆలయంపై దాడిచేశారు.

దుర్గపూజ చేయాలంటే ఒక్కొక్కరు రూ.5 లక్షలు జిజియా పన్ను కట్టాలని ఛాందసవాదులు హుకుం జారీచేస్తున్నారని అధికారులే తెలిపారు. భారత్‌లోని తన రాయబారి ముస్తఫిజుర్ రెహమాన్‌ను వెనక్కుపిలిపించింది. బెల్జి యం, ఆస్ట్రేలియా, పోర్చుల్‌లోని బంగ్లాదేశ్ రాయబారులను మార్చేసింది. ఐరాసలో శాశ్వత రాయబారి వెనక్కు రప్పించింది.