calender_icon.png 15 November, 2024 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టాఫీస్‌లో నకిలీ పాస్‌పుస్తకాలు

14-11-2024 12:59:35 AM

బేగంపేటలో మంథని సీఐ విచారణ

మంథని, నవంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని తపాలాశాఖలో జరిగిన నకిలీ పాసుపుస్తకాల వ్యవహారంపై పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. బేగంపేట గ్రామ బీపీఎంగా పనిచేసిన మెండ హేమ 54 మంది ఖాతాదారులకు చెందిన రూ.34 లక్షల 87 వేలు కాజేసిందని పోస్టల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి మంగళవారం రాత్రి రామగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. ఇంకా ఎవరైనా ఉంటే బాధితులు ముందుకు రావాలని, నకిలీ పాసుపుస్తకాలతోపాటుగా గల్లంతైన నగదుపై లోతైన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తానని మంథని సీఐ బొల్లంపల్లి రాజు గౌడ్ తెలిపారు. సీఐ వెంట రామగిరి ఎస్సై పెట్టం చంద్రకుమార్ ఉన్నారు.