calender_icon.png 12 March, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లవల్లి, ప్యారానగర్ లో డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలి..

11-03-2025 04:50:37 PM

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ప్రజా సంఘాల నాయకులు...

సంగారెడ్డి (విజయక్రాంతి): గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారానగర్ లో ఏర్పాటుచేతల పెట్టిన డంపింగ్ యార్డ్ పనులను వెంటనే నిలిపివేయాలని ప్రజాసంఘాల నాయకులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పచ్చని పంట పొలాలు ఉన్న వ్యవసాయ భూముల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే కాలుష్యం బారిన ప్రజలు పడతారని వారు తెలిపారు. నల్లవల్లి, ప్యారానగర్ డంప్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయం అధికారులకు వివరించారు.