calender_icon.png 17 March, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డ్‌లో బైఠాయించిన

17-03-2025 01:47:19 AM

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి 

మేడ్చల్, మార్చి 16 (విజయ క్రాంతి): మచ్చ బొల్లారం డివిజన్ లోని స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానికులతో కలిసి డంపింగ్ యార్డ్ లో బైఠాయించారు. హిందూ స్మశాన వాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని నినాదంతో సుమారు 40 కాలనీల ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని, హిందూ సంప్రదాయాలను, మనోభావాలను పట్టించుకోకుండా అధికారులు, ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.

డంపింగ్ యార్డ్ ఎత్తివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే అల్వాల్ లోని బల్దియా కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని, కంపెనీ కి కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తానన్నారు.