calender_icon.png 15 March, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొంతు నులిమి చంపేశాం

14-03-2025 11:12:45 PM

అనంతరం శవాన్ని తుంగభద్ర నదిలో పడేసిన ముగ్గురు

ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

పరారీలో మరో ఇద్దరు

బెంగళూరు: కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఉన్న తుంగభద్రలో ఈ నెల 6న ఓ మహిళ శవం దొరికింది. ఇది హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఖాకీలు విచారణను వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ఆ మహిళ హవేరి జిల్లాలోని మసూరు ప్రాంతానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి కూతురైన 22 ఏండ్ల స్వాతిగా నిర్దారించారు. ఇప్పటికే ఆమె కుటుంబసభ్యులు హిరేకెరూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 7నే మిస్సింగ్ కంప్లుంట్ ఇచ్చారు. ఈ కేసులో 13న పోలీసులు నయాజ్ (28) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

నయాజ్ హిరేకెరూర్ టౌన్ వ్యక్తే. విచారణలో భాగంగా ఆ వ్యక్తి నేరం ఒప్పుకుని.. తనకు దుర్గాచారి, వినాయక్ అనే మరో ఇద్దరు వ్యక్తులు సాయం చేసినట్లు తెలిపాడు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు కలిసి స్వాతిని రనేబెన్నూర్‌లోని సువర్ణ పార్క్‌కు అక్కడి నుంచి రత్తిహల్లిలోని ఓ పాడుపడిన పాఠశాలకు తీసుకెళ్లారట. అక్కడే ఓ టవల్‌తో ఆమె గొంతు నులిమి చంపేసినట్లు అతడు పేర్కొన్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇలా చేసినట్లు తెలిపాడు. తర్వాత ఆమె శవాన్ని వినాయక్‌కు చెందిన కారులో తీసుకెళ్లి తుంగభద్ర నదిలో పడేసినట్లు ఒప్పుక్నునాడు. తన కూతురు అనవసరంగా పొట్టన పెట్టుకున్నారని తగిన న్యాయం చేయాలని స్వాతి తల్లి డిమాండ్ చేస్తోంది.