25-03-2025 12:30:45 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, మార్చి 24 (విజయ క్రాంతి): మూగ జీవాలు మన నిజజీవితంలో భాగమయ్యాయని, వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.
సోమవారం ఆయన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీ ప్రధాన రహదారిపై గో పప్పీ పేరుతో కిస్మత్ పూర్ కు చెందిన కే. సూర్య కళా రెడ్డి, నరసింహారెడ్డి దంపతులు ఏర్పాటు చేసిన క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. మూగజీవాలు తమ బాధను వెల్లడించలేవని, దీంతో వాటిని మనం బాగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మూగజీవాలను పెంచుకుంటున్న నేపథ్యంలో వాటి ప్రాధాన్యత పెరిగిందని, కుక్కలను మన ఇంట్లో సభ్యుల మాదిరిగా చూసుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.