నటుడు దుల్కర్ సల్మాన్ 2012లో అరంగేట్రం చేసినప్పటి సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ, అంకితభావంతో ముందుకు సాగుతూ ప్రశంసలు అందుకున్నాడు. ‘బెంగళూరు డేస్’, ‘కన్నుమ్ కన్నుమ్ కొలయాడితల్’, ‘ఓ కాదల్ కన్మణి’, ‘మహానటి’ వంటి ప్రసిద్ధ చిత్రాల నుంచి ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి ఇటీవలి భారీ విజయాల వరకు అన్నింటితో సినీప్రియుల ప్రశంసలు అందుకున్నాడు.
చిత్ర పరిశ్రమలో దుల్కర్ సల్మాన్ ప్రయాణం 13 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ‘కాంత’ సినిమా నుంచి దుల్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ బహుభాషా చిత్రంలో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్‌గా, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు తాజాగా విడుదల చేసిన రెండు పోస్టర్లు దుల్కర్ సల్మాన్‌ను కొత్త హెయిర్ స్టుటైల్‌తో కూడిన సూట్‌లో అద్భుతంగా, ఇంటెన్స్ అవతార్‌లో చూపిస్తున్నాయి. ఒక పోస్టర్‌లో ఆయన సిగరెట్ తాగుతున్నట్లు, మరొక పోస్టర్‌లో ఆయన ఫెరోషియస్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించారు.
1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. అక్కడి మానవ సంబంధాలు, సామాజిక, సంక్లిష్టతలను ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ -ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికృష్ణ గద్వాల్; ఆర్ట్: రామలింగం; రచయిత: తమిళ్ ప్రభ; సంగీతం: జాను; ఎడిటర్: లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్; నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్; దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.