పంత్, రాహుల్‌పైనే అందరి దృష్టి
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ నేటి నుంచి ఆరంభం కానుంది. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఈ టోర్నీ అందరికీ కీలకంగా మారనుంది. సీనియర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రా, అశ్విన్‌లకు దులీప్ ట్రోఫీ నుంచి మినహాయింపు ఇచ్చిన బీసీసీఐ మిగతా వాళ్లందరూ తప్పకుండా ఆడాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది. టీమ్ కెప్టెన్‌గా గిల్, టీమ్d సారధిగా ఈశ్వరన్, టీమ్ కెప్టెన్‌గా రుతురాజ్, టీమ్‌హా శ్రేయస్ నడిపించనున్నారు.
కాగా టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ టీమ్ టీమ్ మధ్య బెంగళూరు వేదికగా జరగనుంది. మరో మ్యాచ్‌లో టీమ్ టీమ్ అనంతపురం వేదికగా ఆడనున్నాయి. గతేడాది జోనల్ ఫార్మాట్‌లో జరిగిన దులీప్ ట్రోఫీ ఈ సారి సరికొత్త ఫార్మాట్లో జరగనుంది. నాకౌట్ మ్యాచెస్ లేకుండానే జరగనున్న టోర్నీలో ప్రతి జట్టు ఇతర జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి ఎక్కువ పాయింట్లతో ఉన్న జట్టును విజేతగా ప్రకటించనున్నారు.
గాయం నుంచి కోలుకుని టీ20 ప్రపంచకప్‌తో పాటు శ్రీలంక సిరీస్ ఆడిన రెడ్ బాల్ (టెస్టు) క్రికెట్ ఆడలేదు. దీంతో పంత్ సహా కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్, రుతురాజ్ ఎలా ఆడుతారన్నది ఆసక్తికరం. టోర్నీ ప్రదర్శన ఆధారంగానే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక ఉంటుందని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తొలి రౌండ్ మ్యాచ్‌లకు ఇప్పటికే సూర్యకుమార్ దూరమవ్వగా తాజాగా ఇషాన్ కిషన్ గాయంతో దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక దులీప్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్ నాలుగు రోజుల పాటు జరగనుంది.