- బరిలో ఆరుకు బదులు నాలుగు జట్లు
- రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: దేశవాలీ ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ టోర్నీని సరికొత్త ఫార్మాట్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమయింది. 1961లో మొదలైన దులీప్ ట్రోఫీ ఇప్పటివరకు ఆరుజట్లతో జోనల్ ఫార్మాట్‌లో జరిగేది. కానీ ఈ ఏడాది నుంచి ఆ విధానానికి స్వస్తి పలికిన బీసీసీఐ నాలుగు జట్లతో ట్రోఫీని నిర్వహించనుంది. జట్లకు టీమ్ టీమ్ టీమ్ టీమ్ పేర్లు పెట్టిన బీసీసీఐ టోర్నీని నాకౌట్ మ్యాచ్‌లు లేకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించనుంది. ప్రతీ జట్టు మిగిలిన అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్‌లు ముగిసిన అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటించనున్నారు. ప్రతీ మ్యాచ్ నాలుగు రోజుల పాటు జరగనుంది.
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు దులీప్ ట్రోఫీలో ప్రదర్శనను బీసీసీఐ పరిగణలోకి తీసుకోనుంది. దులీప్ ట్రోఫీ నుంచి సీనీయర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రా, అశ్విన్‌లకు మినహాయింపు లభించగా.. మిగతావారంతా ఆయా జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. గిల్ (టీమ్ అభిమన్యు ఈశ్వర్వన్ (టీమ్ రుతురాజ్ (టీమ్ శ్రేయస్ అయ్యర్ (టీమ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.