calender_icon.png 16 October, 2024 | 3:57 PM

బకాయిలు విడుదల చేయాలి

16-10-2024 02:43:57 AM

రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ 

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): రాష్ట్రంలో రైస్‌మిల్లర్ల సమస్యలు పరిష్కరించి బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌ను రా రైస్ మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. మంగళవారం సంఘం అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు.

గ్రామీణ యువతకు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నామని, ఈ పరిశ్రమను కాపాడాలని ఈ సందర్భంగా కోరారు. సన్నధాన్యం 67శాతం బియ్యం అవుటర్న్ రాదని, సీఎంఆర్ చేస్తే ఎంత వస్తే దాని ఆధారంగా బియ్యం ఇస్తామని, తగ్గితే నష్టపరిహారం కింద రూ.500 కేటాయించాలని కోరారు. బైండింగ్ మెషిన్, కలర్ సార్టెక్స్ మిల్లింగ్ చార్జీలు రూ. 150 చెల్లించాలని, సన్నధాన్యం 14శాతం తేమతో ఇవ్వాలని, ఎక్కువ తేమ ఉంటే ధాన్యం తొందరగా పాడవుతుందని తెలిపారు.

బియ్యం సంచు లు కొత్తవి ఇవ్వాలని, ధాన్యం దిగుమతి చేస్తూ బియ్యం డెలివరీ తీసుకోవాలని కోరా రు. విద్యుత్ ఛార్జీలు, మిల్ డ్రైవర్స్, గుమాస్తాలు, అకౌంటెంట్, వాచ్‌మెన్ జీతాలు, హమాలీ డబ్బులు ప్రతి 8 రోజులకు ఇవ్వాలన్నారు. 25శాతం బ్యాంక్ గ్యారెంటీ పెట్ట కూడదని చాలా మిల్లర్లు ఇవ్వలేరని ఆయన అన్నారు.

2014 నుంచి డ్రై ఏజ్, సివిల్ సప్ల యి ట్రాన్స్‌పోర్టు, కస్టోడియన్, మిల్లింగ్ ఛార్జీ లు, బైండింగ్ చార్జీలు రావాలని ఆయన తెలిపారు. 2022 నుంచి 2024 వరకు ట్రాన్స్ పోర్టు, మిల్లింగ్ ఛార్జీలు, పాత గన్ని సంచుల ధర రూ. 9లకు నిర్ణయించాలని, లేకుంటే కార్పొరేషన్ వాపసు తీసుకోవాలని కోరారు. 

 టార్గెట్ రెండు నెలలు పొడిగించాలి

ఖరీఫ్ 2023 24 సీజన్ బియ్యం ప్రొ క్యూర్ మెంట్ వందశాతం బియ్యం పెట్టిన వారికి రబీ ధాన్యం దిగుమతి చేసుకున్న రా రైస్ మిల్లర్లకు పౌరసరఫరాల శాఖకు బియ్యం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఖరీప్, రబీ గడువును రెండు నెలల పాటు పొడిగించాలని తెలిపారు.