calender_icon.png 30 October, 2024 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ తీరు వల్లే.. సర్పంచ్‌ల బేజారు

25-07-2024 12:34:11 AM

  1. బీఆర్‌ఎస్‌కు సర్పంచ్‌ల ఉసురు తగుల్తది 
  2. నిధులివ్వకపోవడంతోనే అనేక మంది సర్పంచ్‌ల ఆత్మహత్య 
  3. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): గిరిజనుల ఓటు బ్యాంకు కోసమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా చేసిందని, కానీ ఎక్కడా గ్రామ పంచాయతీభవనాలను నిర్మించలేదని, చెట్ల కిందనే పాలన చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయని ప్రభుత్వ విప్  బీర్ల ఐలయ్య విమర్శించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించారని, దీంతో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిస్తోందన్నారు.