calender_icon.png 4 December, 2024 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంతోనే కాల్వకు గండ్లు

25-09-2024 01:06:01 AM

  1. నేటి నుంచి సాగర్ నీటి విడుదల
  2. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, సెప్టెంబర్ 24(విజయక్రాంతి)/కోదాడ: బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నేడు ఎస్సారెస్పీ కాల్వకు గండ్లు అని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ కాల్వ గండి పూడ్చివేత పనులు, చిలుకూరు మండలంలోని రెడ్లకుంట కాలువ, ఆర్లెగూడెం, నారాయణపురం చెరువు కట్టల పనులను పరిశీలించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వరదలతో నష్టం జరిగిన మొదటి గంట నుంచి సీఎంతో సహా ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. సాగర్ కాలువకు పడిన గండ్లకు మరమ్మతు పనుల్లో జాప్యంపై ఎస్‌ఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే పద్మావతి, నాయకులు పాల్గొన్నారు.