నిజాం హయాంలో భూస్వామ్య శక్తులు, దొరల పెత్తనాన్ని ఎదిరించి పోరాడిన ధీశాలి చాకలి ఐలమ్మ. అయితే సమైక్య రాష్ట్రంలో కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కానీ ఆమెకు సముచిత గౌరవం దక్కలేదంటే అతిశయోక్తి కాదు.దాదాపు ఏడేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పాలకులకు చాకలి ఐలమ్మ గుర్తుకు రాలేదు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఎన్నికలకు ముందు చాకలి ఐలమ్మ వర్ధంతిని అధికారికంగా నిరవహిస్తామనిప్రకటించింది. కానీ అది పూర్తిగా నెరవేరకముందే ప్రభుత్వం మారిపోయింది.
కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకల సందర్భంగా కోఠీలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ప్రకటించడం ముదావహం. అలాగే ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్‌లో సభ్యురాలుగా నియమిస్తున్నట్లు మ్రుఖ్యమంత్రి ప్రకటించడం ఆహ్వానిం చదగ్గ నిర్ణయం. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం కేవలం హామీలకు పరిమితం కాకుండా వాటిని ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నారు.
మన్నారం నాగరాజు, హైదరాబాద్