calender_icon.png 5 March, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ప్రధాన కార్యాలయంలో దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు..

02-03-2025 06:49:47 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి ప్రధాన కార్యాలయములో ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ శాసనసభ స్పీకర్ కీర్తి శేషులు శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను నిర్వహించారు. డిజి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ జి.రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన, ఈ కార్యక్రమములో యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొని, వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... దుద్దిల్ల శ్రీపాదరావు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచలుగా ఎదిగి, మూడుసార్లు మంథని నియోజకవర్గం నుండి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారని, రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో నడిపిన మహోన్నత వ్యక్తి అని తెలియజేశారు. ఈ కార్యక్రమములో డిజి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ జి.రాజేంద్ర ప్రసాద్ తో పాటు గుర్తింపు సంఘం (ఎఐటియసి) బ్రాంచ్ సెక్రటరీ ఎస్. వి.రమణ మూర్తి, ప్రాతినిద్య సంఘం(ఐ‌ఎన్‌టి‌యూ‌సి) వైస్ ప్రెసిడెంట్ పీతాంబర రావు, పర్సనల్ మేనేజర్ ముకుంద సత్యనారాయణ, డివైపిఎం జి కె కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.