02-03-2025 06:45:55 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయం నందు మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యస్ ఓ టూ జియం రామస్వామి హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దుద్దిల్ల శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారని, వారు ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడలో జన్మించారన్నారు.
వారు మంథిని నుండి మూడు పర్యాయాలుగా అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారని తెలిపారు. వారి సేవలు అంకితభావం, సేవకు పర్యాయపదంగా స్థితిస్థాపకతతో రాష్ట్ర రాజకీయాల కల్లోల జలాలను నావిగేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ.జి.యం గిరిదర్ రావు, డీజిఎం పర్సనల్ జీ.వి మోహన్ రావు సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్ గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి లచ్చిరాం ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.