calender_icon.png 28 February, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రంను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు

28-02-2025 04:46:34 PM

మంథని (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు స్మారకార్థం లడ్డు & ఫ్రెండ్స్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేసవి కాలంలో పేద ప్రజలకు త్రాగునీరు అందించాలనే మంచి ఉద్దేశంతో చలివేంద్ర ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.