calender_icon.png 30 October, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంజపడుగులో జననాడి

10-08-2024 03:18:04 PM

జననాడి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న శ్రీను బాబు

మంథని(విజయక్రాంతి): గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించడం కోసమే జననాడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ యువనేత దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం మంథని మండలంలోని గుంజపడుగులో ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. ఆనారోగ్యంగా ఉన్న ప్రజల వివరాలు తెలుసుకొని, వివరాలు గురుంచి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. మంథని నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని, గ్రామ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.