calender_icon.png 25 February, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యైటింగ్ లైన్ కాలనీలో ఘనంగా దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు

24-02-2025 09:24:01 PM

మంథని (విజయక్రాంతి): శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శీనుబాబు జన్మదిన వేడుకలను యైటింగ్ లైన్ కాలనీలో అర్జీ-2 ఐఎన్టియుసి ఆఫీసులో వైస్ ప్రెసిడెంట్ బాదావత్ శంకర్ నాయక్  ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. శీను బాబు  శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా తన సోదరుడైన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కు రాజకీయాల్లో కుడి భుజంగా ఉంటూ మరెన్నో సేవా కార్యక్రమాలను పాలుపంచుకోవాలని కోరుకుంటూ శ్రీనుబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమనీ శంకర్ నాయక్  తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్తనారాయణరెడ్డి, ఐరెడ్డి సంపత్ రెడ్డి, కొంగర రవీందర్, మాజీ డిప్యూటీ మేయర్ చాగంటి శంకర్ జిల్లా కార్యదర్శి పోగుల వీరారెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి యాదగిరి తిరుపతి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పరిహరనాయక్, 19వ డివిజన్ అధ్యక్షులు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి, 19వ డివిజన్ ఎస్ఎస్సిఎల్ అధ్యక్షులు రాకేష్, లక్ష్మణరావు, సావుల శ్రీధర్, నున్న జగదీష్, కంది శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్, సైదులు, మసూద్ అలీ, గన్ను శ్రీనివాస్ రెడ్డి, పిట్టల శ్రీనివాస్, ఆడం సందీప్, తోకల మల్లయ్య, తిరుపతి, శంకర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.