బాదితులకు పరామర్శలో దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. కరీంనగర్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో రామగిరి మండలంలోని సెంటనరీ కాలనికి చెందిన కాంగ్రెస్ నాయకులు మడ్డి రాజ్ కుమార్, పన్నూర్ గ్రామానికి చెందిన కుంట లక్ష్మి లు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతుండగా వారిని శ్రీను బాబు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడిన శ్రీను బాబు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేల చూడాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.