16-03-2025 01:20:28 PM
ఆరెంద శ్రీ బాల విశ్వనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలో దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆరెంద గ్రామంలోని శ్రీ బాల విశ్వనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. అరెంద గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉట్ల అనిల్ రెడ్డి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధిక మెజారిటీతో గెలిస్తే 116 కొబ్బరికాయలు కొడుతా అని మొక్కుకోగా, అందులో భాగంగా ఆదివారం మంత్రిస్ సోదరుడు శీను బాబు సమక్షంలో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.