calender_icon.png 26 February, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో భక్తులకు అల్పాహార వితరణలో పాల్గొన్న దుద్దిళ్ల శ్రీను బాబు

26-02-2025 01:33:47 PM

మంథని నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని,(విజయక్రాంతి): మహా శివరాత్రిని పురస్కరించుకొని మంథని మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు  ఆధ్వర్యంలో గంగా రోడ్డు (బస్  డిపో) వద్ద భక్తులకు అల్పాహారం, మజ్జిగ వితరణ ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సోదరుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు  శ్రీనుబాబు(Duddilla Srinu Babu)  భక్తులకు అల్పాహారం ఆయన  అందించారు. భక్తుల సౌకర్యం కోసం అల్పాహారం ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులను శ్రీనుబాబు అభినందించారు. ఆయన వెంట తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పెంటు రమా దేవి, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.